Nature or Nurture 2

 Ke Sri… Srini Journalist ) .. ….. ప్రపంచంలో కొన్ని విషయాలు అంత తొందరగా మన అవగాహనకి రావు. వచ్చినా సరే, ఎవరికైనా అర్ధమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు కూడా …

మోడరన్ సైంటిస్టు ఎవరినైనా టెలిస్కోప్ లేని రోజుల్లో మన రుషులు గ్రహణ సమయాలు, గ్రహ చలనాలు ఎలా కనుక్కున్నారు అని అడిగి చూడండి ఏం చెప్తారో చూద్దాం …

Ads

ఈ ఉపోద్ఘాతం అంతా జ్యోతిష్యం సైన్సా లేదా నమ్మకమా ? ఆస్ట్రాలజీ మోసగాళ్లు మన కోరికలతో ఆడుకునే ఒక ఆయుధంగా మారిపోయిన టాపిక్ గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను చూడండి …

ఏంటి నా qualfication ఏంటి అంటారా? భలేవారే .. ఓషో ఎం చెప్పాడు? గాడ్ is గ్రీడ్ అన్నాడా లేదా? If యు అర్ నాట్ గ్రీడీ యు donot need గాడ్ అన్నాడా లేదా? ప్రపంచంలో అనేక లక్షల కిటికీలలో ఒక కిటికీ తెరచి చూసి నేను గమనించింది ఇదీ అని తెలియపరచే క్రమంలో మన నమ్మకం మనలో ఎంత దూరం బలంగా నాటుకుంది అని మనకి మనం విశదీకరించుకునే ప్రయత్నమే కదా …

నేను బేసికల్ గా సైంటిస్ట్ … కాస్మిక్ కనెక్ట్ ని ప్రబలంగా నమ్ముతాను .. srinikesi @blogspot .com లో కొన్ని నా ఆలోచనలు ఉన్నాయి … అదీకాక ఇప్పటిదాకా పదివేల పైన జాతకాలూ purely సైంటిఫిక్ రీసన్ తో analyze చేసి చూసాను…

విషయం ఏంటంటే… మన మాజీ ప్రధాని మాన్ మోహన్ సింగ్ గారి మరణం గురించి కాదు కానీ ఆయన జీవితం గురించి.. ఆ జీవన గతిని నిర్ణయించిన జాతకం గురించి.. ప్రస్ఫుటంగా చెప్పుకోవాలంటే కెరీర్ గురించి ..

It is a డ్రీం కెరీర్… నిచ్చెన మొదటి నుంచి చివరి మెట్టు వరకు… ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్లిన ఆ అద్భుతమైన DREAM CAREER చూడండి .. చాలా కాలం చీఫ్ ఎకనామిక్ అడ్వైసర్ , ప్లానింగ్ కమిషన్ చైర్మన్, RBI గవర్నర్ , ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అగైన్ ప్రైమ్ మినిస్టర్ .. కారణం నన్ను అడిగితే ఆయన జాతకంలో ఉన్న బుధాదిత్య యోగం …

manmohan singh

ధనులగ్నానికి దశమ స్థానమైన కన్యలో అత్యంత బలమైన బుధుడితో కలసిన సూర్యుడి కారణంగా అద్భుతమైన కెరీర్ సాధ్యపడింది. బుధుడు వివేకానికి ప్రతీక .. అలాగే సూర్యుడు , గ్రహరాజు కాబట్టి రాజ్యానికి ప్రతీక . దశమ స్థానంలో సూర్యుడు దిక్బలంతో ఉన్నాడు .. కన్యలో బుధుడు ఎక్సల్టెడ్ గా ఉన్నాడు ..

ఇద్దరి కలయిక టెన్త్ హౌస్ అయిన పబ్లిక్ ఇమేజ్ అండ్ ప్రొఫెషనల్ అచీవ‌్మెంట్స్ కి సంబందించిన కన్యలో . ఇక్కడ అద్భుతమైన మరొక యోగం కుదిరింది .. ధర్మ కర్మాధిపతి యోగం . భాగ్య స్థానాధిపతి సూర్యుడు దశమ స్థానాధిపతి బుధుడితో దశమంలో ఉన్నాడు .

భాగ్యంలో గురుడు లగ్నానికి కాపు కాస్తున్నాడు . గురుబలం అంటే మనకి గల భగవదానుగ్రహం లేదా అదృష్టం ఎలా అయిన అనుకోండి .. ఎఫర్ట్స్ తక్కువ, రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి .. అదే గురుబలం లోపిస్తే కేసు రివర్స్ అవుతుంది ..

పని ఎక్కువ, ఫలితం తక్కువ వస్తాయి .. ఈయనకి లగ్నాధిపతి గురుడి లగ్నాని చూసుకుంటున్నాడు .. ఇంకో ముఖ్యమైన విషయం చూడండి .. అష్టమ స్థానం కర్కాటకం .. లగ్నాధిపతి చంద్రుడు స్వస్థలంలో ఉన్నాడు .. పూర్ణాయుషూ…

సప్తమమైన కళత్రాధిపతి దశమంలో కేంద్రంలో ఉన్నాడు కాబట్టి సపోర్టివ్ లైవ్ పార్టనర్ దొరుకుతారు . దశమస్థానం బలంగా ఉంటే కెరీర్ వద్దన్నా పైపైకే వెళ్తుంది .. ఐతే జీవితంలో ఆ దశలు రావడం కూడా ముఖ్యమే ..

బలమైన దశమ స్థానం ఉన్నప్పుడే సోషల్ స్టాండింగ్ బాగా ఉండడం గమనించొచ్చు . సహజంగా బలమైన గ్రహాలూ, సూర్యుడు కానీ కుజుడు గానీ ఉన్నప్పుడు అదింకా మంచిదవుతుంది . జనరల్ గా ఏ ఇంట్లో యోగం జరిగితే ఆ స్థానానికి సంబంధించి velocity అండ్ trajectory పెరుగుతాయి .. ఇదే principle అవయోగాలకి కూడా వర్తిస్తుంది …

Comments

Popular posts from this blog

To be in front page

Scince of living